లార్డ్స్: లార్డ్స్ టెస్టు( Lords Test)లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. గెలుపు దిశగా వెళ్తోంది. మరో రెండు వికెట్లు తీస్తే ఆ జట్టు తన ఖాతాలో అద్భుత విజయాన్ని వేసుకుంటుంది. మూడవ టెస్టులో ఇవాళ అయిదో రోజు టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉదయం 58 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో భోజన విరామ సమయానికి 8 వికెట్ల నష్టానికి 112 రన్స్ చేసింది.
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ బౌలర్లు రఫాడించారు. ఆఖరి రోజు పిచ్‌ను అనుకూలంగా వాడుకున్నారు. తొలుత జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. లైన్ అండ్ లెన్త్‌తో భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. పంత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు ఆర్చర్. ఆఫ్ స్టిక్‌పై పడిన బంతిని ఆఫ్ వికెట్‌ను ఎత్తిపడేసింది. ఆ తర్వాత సందర్ ను కూడా స్టన్నింగ్ రీతిలో ఔట్ చేశాడు ఆర్చర్. అద్భుతమైన రీతిలో తన బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టేశాడు. కేఎల్ రాహుల్ వికెట్‌ను స్టోక్స్ తీసుకున్నాడు. నిలకడగా ఆడుతున్న కనిపించిన రాహుల్.. ఇన్‌స్వింగర్‌కు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
విక్టరీ కోసం ఇండియాకు కావాల్సింది 81 రన్స్ మాత్రమే. కానీ, ఆ టార్గెట్ అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజ్‌లో జడేజా ఉన్నాడు. ఇక మిగిలింది బ్యాటర్లు బుమ్రా, సిరాజ్. నిప్పులు చెరుగుతున్న ఇంగ్లండ్ బౌలర్లను.. టాయిలెండర్లు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే. ప్రధాన బ్యాటర్ జడేజా ఒక్కడే కావడంతో.. దాదాపు భారత్ ఆశలు గల్లంతు అయినట్లే. నితీశ్ రెడ్డి, జడేజా భాగస్వామ్యం.. కొంత వరకు ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టినట్లు అనిపించినా.. సరిగ్గా లంచ్ కు ముందు రెడ్డి ఔటయ్యాడు.
ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 39.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 రన్స్ చేసింది. రాహుల్ 39, పంత్ 9, సుందర్ 0, నితీశ్ 13 రన్స్ చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ మూడు, స్టోక్స్.. కార్సేలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. కీలకమైన అయిదో రోజు ఇండియన్ బ్యాటర్లు రాణించలేకపోయారు. కష్టమైన పిచ్‌పై బ్యాటర్లు రన్స్ స్కోర్ చేసేందుకు ఇబ్బందిపడ్డారు. తీవ్ర వత్తిడిలోకి వెళ్లిన బ్యాటర్లు.. ఆ టెన్షన్ తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. భారత బ్యాటర్లను స్టోక్స్ సేన వత్తిడిలోకి నెట్టి గెలుపు వాకిట నిలిచింది.
Lunch on Day 5 of the Lord’s Test! #TeamIndia 112/8 going into the Lunch break!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg #ENGvIND pic.twitter.com/exXlB9GWSU
— BCCI (@BCCI) July 14, 2025