శనివారం 28 మార్చి 2020
Sports - Feb 15, 2020 , 23:35:55

లక్ష్యసేన్‌ అదరగొట్టినా..

లక్ష్యసేన్‌ అదరగొట్టినా..
  • ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి

మనీలా(ఫిలిప్పీన్స్‌): ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీని యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మట్టికరిపించినా భారత పురుషుల జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మన జట్టు కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 2-3తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇండోనేషియా చేతిలో ఓడింది. సింగిల్స్‌లో భారత యువ షట్లర్‌, 31వ ర్యాంకర్‌ లక్ష్యసేన్‌ 21-18, 22-20తో ఏడో ర్యాంకర్‌ జొనాథన్‌ను రెండో మ్యాచ్‌లో మట్టికరిపించాడు. అంతకుముందు సాయిప్రణీత్‌ 6-21తో  గింటింగ్‌పై మ్యాచ్‌ లో వెనుకబడిన సమయంలో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. డబుల్స్‌లో అర్జున్‌ - ధృవ్‌ జోడీ 10-21, 21-14, 21-23తో అహ్సన్‌ - సెటివాన్‌ జంట చేతిలో ఓడింది. ఆ తర్వాత శుభంకర్‌ డే 21-17, 21-15తో హిరెన్‌ రుస్టావిటోకు షాకివ్వడంతో భారత్‌ 2-2తో స్కోర్లను సమం చేయగలిగింది. నిర్ణయాత్మక పురుషుల డబుల్స్‌లో భారత జోడీ చిరాగ్‌ శెట్టి - లక్ష్యసేన్‌ 21-6, 13-21తో ప్రపంచ నంబర్‌వన్‌ జంట ఫెర్నాడి - సంజయ సుకాముల్జో చేతిలో ఓడిపోయింది. దీంతో భారత జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.


logo