Hockey Asia Cup | కజకిస్థాన్‌పై గోల్స్ వర్షం.. భారీ విజయంతో సూపర్ 4కు చేరిన భారత్
Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న పురుషుల హాకీ ఆసియా కప్(Hockey Asia Cup)లో భారత జట్టు చెలరేగిపోతోంది. తమ అద్భుత ఆటతో అభిమానులను అలరిస్తూ.. వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది.
Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న పురుషుల హాకీ ఆసియా కప్(Hockey Asia Cup)లో భారత జట్టు చెలరేగిపోతోంది. తమ అద్భుత ఆటతో అభిమానులను అలరిస్తూ.. వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. సోమవారం కజకిస్థాన్ (Kazakistan)పై గోల్స్ వర్షం కురిపించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 15-0తో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దండ్రయాత్ర చేసిన అభిషేక్, సుఖ్జీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్ తలా మూడేసీ గోల్స్ సాధించారు. దాంతో, అజేయంగా సూపర్ 4కు దూసుకెళ్లింది టీమిండియా. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి చైనా ముందంజ వేసిన విషయం తెలిసిందే.
హాకీ ఆసియా కప్‌లో ఆతిథ్య భారత్ జోరు చూపిస్తోంది. తొలి మ్యాచ్‌లో చైనాపై సాధికారిక విజయంతో బోణీ కొట్టిన టీమిండియా రెండో గేమ్‌లో బలమైన జపాన్‌కు చెక్ పెట్టింది. సోమవారం కజకిస్థాన్‌పై మాత్రం భారత ఆటగాళ్లు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. నాలుగైదు కాదు ఏకంగా 15 గోల్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు.
𝗙𝘂𝗹𝗹 𝗰𝗼𝗻𝘁𝗿𝗼𝗹, 𝗳𝘂𝗹𝗹 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝗻𝗰𝗲! 🔥 🇮🇳
India round up the Pool stages of the Hero Asia Cup Rajgir, Bihar 2025 with a emphatic 15-0 triumph over Kazakhstan.#HockeyIndia #IndiaKaGame #HumSeHaiHockey #HeroAsiaCupRajgir pic.twitter.com/ZNBsFfztM3
— Hockey India (@TheHockeyIndia) September 1, 2025
ఆట మొదలైన 5వ నిమిషంలోనే అభిషేక్ తొలి గోల్ అందించాడు. అతడు మరో మూడు గోల్స్‌లో చెలరేగగా.. సుఖ్జీత్ సింగ్ (15వ నిమిషం, 32వ నిమిషం, 38వ నిమిషం), జుగ్రాజ్ సింగ్(24వ నిమిషం, 31వ నిమిషం, 47వ నిమిషం), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(26 వ నిమిషం), అమిత్ రోహిదాస్(29వ నిమిషం), రాజిందర్ సింగ్ (32వ నిమిషం), సంజయ్ సింగ్ (54వ నిమిషం), దిల్‌ప్రీత్ సింగ్ (55వ నిమిషం) గోల్స్ చేయడంతో భారత్ జయభేరి మోగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

