ఢిల్లీ : భారత ఈక్వెస్ట్రియన్ ఆశిష్ లిమాయె సరికొత్త చరిత్ర సృష్టించాడు. పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఏషియన్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్స్‌లో అతడు స్వర్ణం సాధించి ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
విల్లీ బీ డన్ (గుర్రం పేరు)తో కలిసి సత్తాచాటిన అతడు.. డ్రెస్సేజ్ రౌండ్లో మూడో స్థానంలో నిలిచినా క్రాస్ కంట్రీ, జంపింగ్ ఫేస్‌లో మాత్రం అదరగొట్టాడు. మూడు విభాగాల్లో కలిసి 29.4 పాయింట్లతో పసిడి నెగ్గాడు. ఈ ఈవెంట్లో భారత్.. టీమ్ ఈవెంట్లోనూ ఆశిష్, శశాంక్ కలిసి రజతం గెలిచారు.