ఆరో టైటిల్ వేటలో.. నేటి నుంచే హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
ఆరు దేశాలు పాల్గొంటున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి నవంబర్ 5 దాకా సాగే టోర్నీకి పంజాబ్‌లోని జలందర్, మొహాలీ ఆతిథ్యమివ్వనున్నాయి.
జలందర్ : ఆరు దేశాలు పాల్గొంటున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి నవంబర్ 5 దాకా సాగే టోర్నీకి పంజాబ్‌లోని జలందర్, మొహాలీ ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి రోజు రాత్రి 7 గంటలకు జరుగబోయే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
భారత్, బంగ్లాతో పాటు జపాన్, చైనా, మలేషియా, సౌత్ కొరియా మిగతా జట్లుగా ఉన్నాయి. టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.. టోర్నీలో ఆరో టైటిల్‌పై గురిపెట్టింది. గతంలో 2011, 2016, 2018, 2023, 2024లో భారత్ టైటిళ్లు గెలుచుకుంది. కాగా జాతీయ జట్టులో ఆడే ఆటగాళ్లలో ఎక్కువ భాగం పంజాబ్ ఆటగాళ్లున్నా ఆ రాష్ట్రం ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుండటం 17 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

