చైనాను చిత్తుచేసి..
సొంతగడ్డపై ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌పై ఏకపక్ష విజయం సాధించిన భారత్ గురువారం జరిగిన మ్యాచ్‌లో 5-2తో చైనాను చిత్తుచేసింది. నాలుగు క్వార్టర్స్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వకుండా ఆడింది.
- ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రెండో విజయం
జలందర్: సొంతగడ్డపై ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి పోరులో బంగ్లాదేశ్‌పై ఏకపక్ష విజయం సాధించిన భారత్ గురువారం జరిగిన మ్యాచ్‌లో 5-2తో చైనాను చిత్తుచేసింది. నాలుగు క్వార్టర్స్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వకుండా ఆడింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (12, 34 నిమిషాల్లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (27, 31) చెరో రెండు గోల్స్ చేయగా జుగ్రాజ్ సింగ్ (47) ఒక గోల్ చేశాడు.
చైనా నుంచి యాంగ్ పెంగ్ (25), చెన్ చొంగ్కాంగ్ (36) గోల్ కొట్టారు. తొలి క్వార్టర్‌లోనే చైనా డిఫెన్స్‌ను ఛేదిస్తూ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో సుఖ్జీత్ గోల్స్ ఖాతా తెరిచాడు. రెండో క్వార్టర్లో పట్టుదలగా ఆడిన చైనా.. భార త రక్షణ శ్రేణిపై ఒత్తిడి పెంచుతూ 25వ నిమిషంలో గోల్కొట్టింది. అయితే నిమి షం వ్యవధిలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. అదే ఊపులో 3 నిమిషాల్లోనే ఆతిథ్య జట్టు రెండు గోల్స్ కొట్టిం ది. ఆ తర్వాత చైనా గోల్ చేసినా జుగరాజ్ చివరి క్వార్టర్లో చేసిన గోల్‌తో చైనా కుదేలైంది. శుక్రవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

