షార్జా: అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక 46.2 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. లక్విన్ అభయసింఘే(69), షారుజన్ షణ్ముగనాథన్(42) మినహా అందరూ బ్యాటర్లు నిరాశపరిచారు. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. భారత బౌలర్లలో చేతన్‌శర్మ మూడు వికెట్లతో రాణించగా, కిరణ్ చోర్మలే, ఆయుశ్ మాత్రె రెండు వికెట్లతో లంకను నిలువరించారు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యువ భారత్ సూర్యవంశీ(36 బంతుల్లో 67, 6ఫోర్లు, 5సిక్సర్లు) ధనాధన్ అర్ధసెంచరీతో 21.4 ఓవర్లలో 175-3 స్కోరు చేసింది. ఓపెనర్ ఆయూశ్ మాత్రె(34)తో కలిసి తొలి వికెట్‌కు సూర్యవంశీ 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన సూర్యవంశీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది.