న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ స్మృతి మంధాన(Smriti Mandhana) టాప్ ప్లేస్ కొట్టేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల జాబితాలో మంధాన ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. స్టయిలిస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్మృతి.. ఆ మ్యాచ్‌లో 63 బంతుల్లో 58 రన్స్ స్కోరు చేసింది. దాంట్లో ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఆ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కీవర్ బ్రంట్‌ను స్మృతి దాటేసింది. దీంతో మళ్లీ 2019 జనవరి తర్వాత బ్యాటర్ల జాబితాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ ఏడాది జూలైలో కూడా స్మృతి తొలి ర్యాంక్‌లో ఉంది.
Smriti Mandhana regains the 🔝 spot in the latest ICC Women’s ODI ranking with #CWC25 commencing on September 30 👏
More 👉 https://t.co/zFPoE6CP8Y pic.twitter.com/YkUvSt8Ihh
— ICC (@ICC) September 16, 2025
ర్యాంకులను మెరుగుపరుచుకున్న భారతీయ మహిళా క్రికెటర్లలో రిచా ఘోష్, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్ ఉన్నారు. 39వ స్థానం నుంచి 36 వ స్థానానికి రిచా ఘోష్, 42వ స్థానంలో ప్రతికా రావల్ ఉన్నది. హర్లీన్ డియోల్ 43వ స్థానంలో ఉన్నది. బౌలర్ల జాబితాలో స్నేహ రాణా.. 16వ స్థానానికి చేరుకున్నది.
స్మృతి మంధాన ఇప్పటి వరకు 106 వన్డేలు ఆడింది. వాటిల్లో ఆమె 46.46 సగటుతో 4646 రన్స్ చేసింది. వీటిల్లో 11 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో మంధాన అత్యుత్తమ స్కోరు 136 రన్స్.