Duleep Trophy | బెంగళూరు: భారత స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ సారథ్యంలో దులీప్ ట్రోఫీ బరిలోకి దిగిన ఇండియా ‘ఏ’కు తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయం వేదికగా ఇండియా ‘బీ’తో జరిగిన మొదటి మ్యాచ్లో ‘ఏ’ జట్టు 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని ఇండియా ‘బీ’ రెండో ఇన్నింగ్స్లో నిర్దేశించిన 274 పరుగుల ఛేదనలో గిల్ సేన.. 198 పరుగులకే ఆలౌట్ అయింది.