హైదరాబాద్, ఆట ప్రతినిధి: బడి ఈడు పిల్లలకు బంపర్ ఆఫర్. భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం. ఈ నెల 25 నుంచి ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొదలయ్యే టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 6-12 తరగతులకు చెందిన విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పిస్తున్నది. మ్యాచ్‌ను చూడాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్‌లో స్టేడియానికి రావాల్సి ఉంటుందని హెచ్‌సీఏ పేర్కొంది. స్టేడియానికి వచ్చే పిల్లల కోసం హెచ్‌సీఏ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నది. ఈ నెల 18లోగా ఆసక్తి ఉన్న స్కూల్ యాజమాన్యాలు హెచ్‌సీఏ సీఈవోకు ceo.hydca@gmail. com మెయిల్ ద్వారా గానీ స్టేడియంలో గానీ తెలియజేయాలని హెచ్‌సీఏ తెలిపింది.