లిమా (పెరూ): ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో లిమా వేదికగా జరుగుతున్న జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత్ పతక జోరును కొనసాగిస్తోంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ టీమ్ కాంపిటీషన్ ఫైనల్లో ముకేశ్ నెలవెల్లి, రాజ్వర్దన్ పాటిల్, హర్సిమర్ సింగ్ కూడిన భారత త్రయం పసిడి సాధించింది. ఈ టోర్నీలో భారత్కు ఇది 11వ స్వర్ణం. ఇదే ఈవెంట్ వ్యక్తిగత ఈవెంట్లో రాజ్వర్దన్, ముకేశ్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 11 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో 16 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.