బిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ‘ఏ’ (మహిళల) జట్టు టీ20 సిరీస్‌లో నిరాశపరిచినా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మాత్రం గెలుపుతో ఆరంభించింది. ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన తొలి వన్డేలో భారత్ ‘ఏ’.. 3 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను రాధా (3/45), టిటాస్ సాధు (2/37) కట్టడి చేయడంతో కంగారూలు 214 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
అనిక (92*), రాచెల్ (51) ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. ఛేదనను భారత్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ఓపెనర్లు యస్తికా (59), షఫాలీ (36) శుభారంభం అందించగా ధారా గుజ్జర్ (31), రఘ్వీ (25) రాణించారు.