నార్తాంప్టన్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భారత ‘ఏ’ జట్టు మరో ప్రాక్టీస్ మ్యా చ్‌కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్ టీమ్‌తో భారత ద్వితీయ శ్రేణి జట్టు నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ కారణంగా తొలి వామప్ మ్యాచ్‌కు దూరమైన రాహుల్..రెండో మ్యాచ్‌లో కీలకం కాబోతున్నాడు.
ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన రాహుల్.. ప్రస్తుతం జట్టులో సీనియర్‌గా కొనసాగుతున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చేందుకు మొగ్గుచూపుతున్న రాహుల్ ప్రాక్టీస్ పోరులో సత్తాచాటాలని చూస్తున్నాడు.