IND vs SL : భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. అతని బౌలింగ్‌లో కుశాల్ మెండిస్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కీపర్ కేఎల్ రాహుల్, మెండిస్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టుకున్నాడు. దాంతో భారత్‌కు కీలకమైన వికెట్ దక్కింది. అంతకు ముందు ఓవర్లో సిరాజ్, ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (1) తొలి వికెట్‌గా వెనక్కి పంపాడు. నవనిదు ఫెర్నాండో (19), చరిత అసలంక (1) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు లంక రెండు వికెట్ల నష్టానికి 31 రన్స్ చేసింది.