దుబాయ్: టీమిండియా ఓపెనర్లకు పూనకం వచ్చిందేమో? పసికూన స్కాట్లాండ్పై దుమ్ముదులిపేస్తున్నారు. 86 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టుకు రోహిత్ శర్మ (16 బంతుల్లో 30), రాహుల్ (19 బంతుల్లో 50) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
కానీ ఐదో ఓవర్లో స్కాట్లాండ్ బౌలర్ వీల్ వేసిన బంతికి ఎల్బీగా రోహిత్ వెనుతిరగడంతో అభిమానులు కొంత నిరుత్సాహపడ్డారు. ఆ తర్వాత 18 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న రాహుల్.. మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్ ముగించాలనే ఉద్దేశ్యంతో ఆరో ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన రాహుల్ అవుటయ్యాడు.
అయితే అప్పటికి జట్టు స్కోరు 82/2. రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు.