దుబాయ్: తన చేతికి బంతి వచ్చిన తొలి ఓవర్లోనే టీమిండియా పేసర్ షమీ సత్తా చాటాడు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సే (24)ను పెవిలియన్ చేర్చాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన మున్సే.. బంతిని బలంగా బాదలేకపోయాడు.
దీంతో తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను హార్దిక్ పాండ్యా చక్కగా అందుకున్నాడు. 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్.. తొలి పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి 27/2తో నిలిచింది.