హాఫ్ సెంచరీ చేసి సఫారీల తరఫున ఒంటరి పోరాటం చేస్తున్న టెంబా బవుమా (52) పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటుతున్న భారత పేస్ దళంలో.. వెటరన్ మహమ్మద్ షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి ఇన్నింగ్సులో సఫారీలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
తన చేతికి బంతి వచ్చిందంటే.. ఒక వికెట్ తీయాలనే విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న బవుమాను అవుట్ చేశాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న షమీ డెలివరీ.. వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దీంతో ఏడో వికెట్ కోల్పోయిన సఫారీలు.. ఫాలో ఆన్ గండం తప్పించుకునేందుకు పోరాడుతున్నారు.
ఫోర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బవుమాను ఆ తర్వాతి రెండో బంతికే షమీ పెవిలియన్ చేర్చడంతో భారత అభిమానులు షమీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇప్పటికే నాలుగు వికెట్లు తీసిన షమీ.. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.