చాలా రోజుల తర్వాత అర్ధశతకంతో ఆకట్టుకున్న వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే.. దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. రబాడా వేసిన అద్భుతమైన డెలివరీకి పెవిలియన్ బాటపట్టాడు. ఆఫ్‌స్టంప్‌కు కొంచెం దూరంగా రబాడ షార్ట్ పిచ్ బాల్ వేశాడు. దాన్ని ఆడేందుకు రహానే ప్రయత్నించగా.. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ వెరెన్నే అందుకున్నాడు.
సౌతాఫ్రికా జట్టు మొత్తం అప్పీలు చేసింది. కాసేపు ఆలోచించిన అంపైర్.. రహానేను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే పెవిలియన్ బాటపట్టాడు. మరో ఎండ్‌లో ఛటేశ్వర్ పుజారా (51 నాటౌట్) నిలకడగా రాణిస్తున్నాడు.
రహానే వెనుతిరగడంతో తెలుగు ఆటగాడు హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. రహానే అవుటవడంతో భారత జటట్ు 155/3తో నిలిచింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికాపై 128 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.