మూడో వన్డేలో కూడా సఫారీల జోరు కొనసాగుతోంది. 25 ఓవర్ల ఆట ముగిసే సమయానికి పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఓపెనర్ జానెమన్ మలాన్ (1) విఫలమైనా మరో వెటరన్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (81 నాటౌట్) అద్భుతంగా రాణిస్తున్నాడు.
అతనికి ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవుమా (8), ఎయిడెన్ మార్క్రమ్ (15) కొంత సేపు సహకారం అందించారు. వారిద్దరూ అవుటైన తర్వాత సూపర్ ఫామ్లో ఉన్న రాసీ వాన్ డర్ డస్సెన్ (28 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. వీళ్లిద్దరూ కలిసి చక్కగా బ్యాటింగ్ చేస్తుండటంతో సఫారీ జట్టు సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి 139/3 స్కోరుతో నిలిచింది.
వీళ్ల బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే సఫారీలు భారీ స్కోరు సాధించి, భారత్ ముందు అసాధ్యమైన లక్ష్యాన్ని నిలిపే అవకాశం ఉంది. భారత బౌలర్లలో పేసర్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బవుమా రనౌట్ అయ్యాడు.