చావోరేవో తేలే మూడో టెస్టులో భారత ఓపెనర్లు నిరాశపరిచారు. ఆ తర్వాత వెటరన్ బ్యాటర్లు పుజారా (9), రహానే (1) తీవ్రంగా విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ కోహ్లీ మీదనే పడింది. అతనికి రిషభ్ పంత్ జత కలిశాడు. మరీ ఎగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేయకుండా పంత్‌కు కోహ్లీ కళ్లెం వేశాడేమో? ఇద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.
ఒకవైపు కోహ్లీ అసలు సిసలు టెస్టు క్రికెట్ ఆడుతుంటే.. మరోవైపు పంత్ వన్డే తరహా బ్యాటింగ్ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 50 పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికే భారత ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరగా.. మూడో రోజు ఆట మొదలవగానే పుజారా పెవిలియన్ చేరుకున్నాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే రహానే కూడా అవుటయ్యాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఈ పిచ్‌పై కనీసం 200 పరుగుల టార్గెట్ అయినా లేకపోతే భారతజట్టు గెలవడం కష్టమని పలువురు నిపుణులు చెప్తున్న తరుణంలో కోహ్లీ, పంత్ భాగస్వామ్యం చాలా కీలకంగా మారనుంది.