టీమిండియాతో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన సఫారీ జట్టులో ఒక ఆటగాడు చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. సౌతాఫ్రికా ఆటగాడైన అతను ‘జై శ్రీరామ్’ అంటూ ఈ పోస్టు చేయడమే ఇందుకు కారణం.
ఈ పోస్టు చేసిందెవరో కాదు.. భారత మూలాలున్న సౌతాఫ్రికా ఆటగాడు కేశవ్ మహరాజ్. భారత్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను సఫారీ జట్టు 3-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విజయంపై కామెంట్ చేసిన కేశవ్ మహరాజ్..
‘‘ఎంత అద్భుతమైన సిరీజ్. సౌతాఫ్రికా జట్టుకు ఇంతకన్నా గర్వకారణమైన క్షణం ఉండదు. ఎంత దూరం వచ్చాం. ఇక రీచార్జ్ చేసుకొని, తర్వాతి సవాలుకు సిద్ధమవ్వాలి. జై శ్రీ రామ్’’ అని పోస్టు పెట్టాడు. దీనితోపాటు కప్పుతో సఫారీ జట్టు ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.