Ind Vs Pak | ప్రపంచకప్ టోర్నీ (ICC World Cup 2023)లో భాగంగా శనివారం జరిగిన మెగా పోరులో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మహమ్మద్ రిజ్వాన్ (49; 7 ఫోర్లు), ఇమాముల్ హక్ (36; 6 ఫోర్లు) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో భారత అభిమానులు చేసిన ఒక పనికి తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (49) ఔటయిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కి వెళుతుండగా.. భారత అభిమానులు అతడిని చూసి ‘జై శ్రీ రామ్ జై శ్రీ రామ్’ అంటూ అరవడం మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్న భారత అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. క్రికెట్‌కి మతం రంగు పూయవద్దని.. ఇది ప్రేమ భావోద్వేగాలతో కూడిన ఆట అని ఇందులో మతాన్ని తీసుకువచ్చి అపవిత్రం చేయకండి అంటూ నెటిజన్లు కోరుతున్నారు.
Pàkistan batsman Muhammad Rizwan was returning to the pavilion after getting out.
He had to face ‘Jai Shri Ram’ chants from the crowd of Narendra Módi stadium during #IndiaVsPakistan WC today.
Thoughts? pic.twitter.com/IvbpFnE8fh
— Amock (@Politics_2022_) October 14, 2023
When Rizwan got out, Crowd chanting “Jai Shri Ram”
how would you ppl will feel if indian players are teased by calling “ALLAH Hu Akbar”
It’s cricket for God sake 🙏!it brings us international shame!#Ahmedabad | #BabarAzam𓃵 | #IndiaVsPakistan | #CWC23 | #PAKvIND | #indvspak2023 pic.twitter.com/Vz6Ba8m1im— Vikrant Gupta 🏏 (@VikrantGupta75) October 14, 2023
మరోవైపు దీనిపై తమిళ నటుడు, మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ (Udaynidhi Stalin) స్పందిస్తూ.. భారతదేశం క్రీడాస్ఫూర్తికి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాక్ ఆటగాళ్లను మన అభిమానులు ఇలా ట్రీట్ చేయడం మంచిది కాదు. క్రీడలు అనేవి దేశాలను ఏకం చేసే శక్తిగా ఉండాలి కానీ.. ద్వేషాన్ని వ్యాపింపజేసేందుకు సాధనంగా ఉండకుడదు అంటూ స్టాలిన్ రాసుకోచ్చారు.
India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK
— Udhay (@Udhaystalin) October 14, 2023