IND vs NZ : భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌కు షాక్.. ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. లోకల్ బాయ్ సిరాజ్ బౌలింగ్‌లో డ్వేన్ కాన్వే (10) అవుట్ అయ్యాడు. తొలి రెండు బంతులకు తడబడిన కాన్వే ఫైన్ లెగ్‌వైపు భారీ షాట్‌కు భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే.. కుల్దీప్ యాదవ్ క్యాచ్ అందుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. అలెన్ 14, హెన్రీ నికోల్స్ క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 28 రన్స్ చేసింది.