కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ రెండో మ్యాచ్‌లో కూడా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచిన రోహిత్.. ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకున్నట్లు రోహిత్ వెల్లడించాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో గాయపడిన మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఐపీఎల్లో అద్భుతంగా రాణించి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయనున్నాడు. న్యూజిల్యాండ్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. లోకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర, టాడ్ ఆసిల్ ముగ్గురూ బెంచ్‌కే పరిమితం అవనున్నారు. వీరి స్థానాల్లో ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, జిమ్మీ నీషమ్ ఆడనున్నారు.
🎥 🎥 Congratulations to @HarshalPatel23 who is set to make his #TeamIndia debut. 👏 👏@Paytm #INDvNZ pic.twitter.com/n9IIPXFJQ7
— BCCI (@BCCI) November 19, 2021
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్
న్యూజిల్యాండ్: మార్టిన్ గప్తిల్, డారియల్ మిచెల్, మార్క్ చాప్‌మ్యాన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సేఫెర్ట్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి.