IND vs NZ : కుల్దీప్ యాదవ్ రెండో వికెట్ తీశాడు. అతడి బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. 17వ ఓవర్ నాలుగో బంతికి అంపైర్ అవుట్ ఇవ్వడంతో మిచెల్ రివ్యూ తీసుకున్నాడు. అయితే.. రివ్యూలో బంతి లెగ్ స్టంప్‌ను తాకింది. దాంతో, మిచెల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. గ్రెన్ ఫిలిప్స్ క్రీజులోకి వచ్చాడు. 17 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 94 రన్స్ చేసింది.