IND vs NZ : ప్రమాదకరంగా మారుతున్న నికోలస్ (42), కాన్వే (58) జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ఎల్బీగా పెవిలియన్ పంపాడు. అయితే.. అంపైర్ ఔట్ ఇవ్వడంతో నికోలస్ రివ్యూ తీసుకున్నాడు. కానీ, రివ్యూలో బంతి స్టంప్స్‌కు తగిలింది. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు ఓవర్లో ఓపెనర్ డ్వేన్ కాన్వే అర్థశతకం సాధించాడు. వాషింగ్టన్ సుందర్ ఓవర్లో సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. నికోలస్‌తో కలిసి అతను రెండో వికెట్‌కు 106 పరుగులు జమ చేశాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది.