కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. 154 పరుగుల లక్ష్యఛేదనలో కేఎల్ రాహుల్ (45 నాటౌట్), రోహిత్ (30 నాటౌట్) శుభారంభం అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ జట్టు.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లు ముగిసేసరికి 153/6 స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
లక్ష్య ఛేదనలో ఓపెనర్లిద్దరూ నిలకడగా రాణిస్తున్నప్పటికీ స్కోరు వేగంగా పెంచడానికి భారత బ్యాట్స్‌మెన్ కష్టపడుతున్నారు. పదో ఓవర్లో రోహిత్ రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 79/0గా నిలిచింది.