IND vs NZ : భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. టిక్నర్ ఓవర్లో గిల్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. డ్వేన్ కాన్వే క్యాచ్ అందుకోవడంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. అతను 78 బంతుల్లోనే 112 రన్స్ చేశాడు. 13 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన అతను కివీస్ బౌలర్లు ఉతికి ఆరేశాడు. అంతకుముందు వన్డేల్లో 30 సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఔటయ్యాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దాంతో, 212 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. వెంటనే వెంటనే ఓపెనర్లను ఔట్ చేసి కివీస్ ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం కోహ్లీ 10, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్.. 231/2