IND vs ENG T20 Series | ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. 14 నెలల తర్వాత షమీ రీ ఎంట్రీ..
IND vs ENG T20 Series | ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు.
IND vs ENG T20 Series | ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు. చీలమండ గాయం కారణంగా నవంబర్ 2023 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ గతేడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. దాదాపు 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో షమీ తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. క్వార్టర్ ఫైనల్లో బరోడాపై రెండు వికెట్ల పడగొట్టాడు.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచులు ఆడి.. ఐదు వికెట్ల తీసుకున్నాడు. గత కొద్ది నెలలుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని భావించినా చోటు దక్కలేదు. తాజాగా సెలెక్టర్లు వైద్య బృందంతో చర్చించి తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. షమీ టీ20ల్లో 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతున్నారు. అప్పటి నుంచి మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. షమీ 23 టీ20 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టీ20 సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది.
టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).
#TeamIndia‘s squad for the T20I series against England 🔽
Suryakumar Yadav (C), Sanju Samson (wk), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Rinku Singh, Nitish Kumar Reddy, Axar Patel (vc), Harshit Rana, Arshdeep Singh, Mohammad Shami, Varun Chakravarthy, Ravi Bishnoi,… https://t.co/eY8LUSspCZ
— BCCI (@BCCI) January 11, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
Sunny Deol | 68 ఏళ్ల వయసులో ఓటీటీ ఎంట్రీ … యాక్షన్ లేకుండా సినిమా చేయడంపై మొదట భయపడ్డ స్టార్ హీరో!
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

