IND Vs ENG | కటక్ బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండోవన్డే ఆదివారం జరిగింది. ఫ్లడ్లైట్స్ పనిచేయకపోవడంతో దాదాపు 30 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఈ విషయంపై క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA) నుంచి వివరణ కోరుతామన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఇతర సీనియర్ మంత్రులతో కలిసి స్టేడియంలోనే ఉన్నారు. ఫ్లడ్‌లైట్లు పనిచేయకపోవడంపై ఓసీఏ నుంచి వివరణ కోరనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకొని.. ముందస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఫ్లడ్‌లైట్లు నిలిచిపోయాయన్నారు. అయితే, ప్రతి ఫ్లడ్ లైట్ టవర్ రెండు జనరేటర్లకు అనుసంధానించినట్లు ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహెరా పేర్కొన్నారు. క జనరేట్ పని చేయని సమయంలో.. మరో జనరేటర్ ప్రారంభించామని.. కానీ, ఆటగాళ్ల వాహనం టవర్, రెండో జనరేటర్ మధ్య నిలిచి ఉంచినందున తొలగించేందుకు కొంత సమయం ఆయన తెలిపారు. బారాబతి, కటక్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ ఫ్లడ్ లైట్ పనిచేయకపోవడం దురదృష్టకరమన్నారు. నిష్పాక్షిక విచారణ జరగాలన్నారు. రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిపించింది.