IND Vs ENG 2nd T20 | ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌పై టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ 13 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. మరోసారి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంతకు ముందు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ వరుణ్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ వైఫల్యానికి పొగ మంచే కారణమని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. చెన్నై టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో పొగమంచు కారణంగా బౌలర్ల లైన్, లెన్త్‌ను సమర్థవంతంగా అంచనా వేయలేకపోయామని చెప్పుకొచ్చాడు. వరుణ్ బౌలింగ్‌ను అంచనా వేయడం కష్టమని.. దట్టంగా ఉన్న పొగమంచు పరిస్థితిని మరింత కఠినంగా మార్చేసిందని.. చెన్నై మ్యాచ్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నట్లు బ్రూక్ పేర్కొన్నాడు. శనివారం నాటి మ్యాచ్‌లోనే వరుణ్ బౌలింగ్‌లోనే.. హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. ఇక్కడ స్పష్టంగా వెలుతురు ఉందని.. ఎలాంటి పొగమంచు లేదంటూ స్పందించారు. వరుణ్ బౌలింగ్‌లోనే అవుట్ అయిన విషయాన్ని మరో కామెంటేటర్ రవిశాస్త్రి తెలిపాడు. మరోసారి.. బ్రూక్‌ను వరుణ్ ఔట్ చేశాడని.. పొగ మంచు అవసరం లేదని.. కనబడకుండా బంతి దూసుకెళ్లి వికెట్లను పడేసిందంటూ రవిశాస్త్రి కామెంట్ చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
తిలక్ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో టీమిండియా.. చెన్నై మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 19.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ 55 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్ల సహాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.