IND Vs BAN ODI | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్.. రషిద్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 229 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి మరో 117 పరుగుల దూరంలో ఉన్నది. ప్రస్తుతం 23.3 ఓవర్లకు టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 47, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ మంచి శుభారంభం అందించి. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. 36 బంతుల్లో ఏడు ఫోర్ల సహాయంతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ.. తక్సిన్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్, గిల్ జోడీ ఆచితూడి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. 22.4 ఓవర్లో తక్సిన్ బౌలింగ్‌లో విరాట్ పెవిలియన్‌కు చేరాడు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో వన్డేల్లో 11వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌పై 12 పరుగులు చేసి.. రోహిత్ శర్మ వన్డేల్లో వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్, రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ కంటే వేగంగా ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ 222 వన్డేల్లో ఈ ఘనత సాధించడగా.. రోహిత్ శర్మ 261 వన్డేల్లో 11వేల పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో 11వేల పరుగులు చేసిన పదో ప్లేయర్‌గా నిలిచాడు. వన్డేల్లో 18,426 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ పేరిట ఈ రికార్డు ఉన్నది. 14, 234 పరుగులతో కుమార సంగక్కర, 13,963 పరుగులతో విరాట్ కోహ్లీ స్థానాల్లో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.