ఉప్పల్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ పుంజుకుంది. ఆరంభంలో కామెరూన్ గ్రీన్ (52) ధాటిగా ఆడి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు. అయితే ఫించ్ (7), స్టీవ్ స్మిత్ (9), గ్లెన్ మ్యాక్స్వెల్ (6) నిరాశ పరిచారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. జోష్ ఇంగ్లిస్ (24) ఫర్వాలేదనిపించినా జోరు పెంచలేకపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మాథ్యూ వేడ్ (1)ను అక్షర్ అవుట్ చేశాడు. ఇలాంటి సమయంలో టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54) ధాటిగా ఆడాడు.
అతనికి డానియల్ శామ్స్ (28 నాటౌట్) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో చెలరేగగా.. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.