టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధం అవడంలో భాగంగా.. ఆస్ట్రేలియాతో ఆడుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50), రాణించారు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (19), దినేష్ కార్తీక్ (20) ఫర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ (15), హార్దిక్ పాండ్యా (2) నిరాశ పరిచారు.
అక్షర్ పటేల్ (6 నాటౌట్) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. కేన్ రిచర్డ్సన్ వేసిన చివరి ఓవర్లో సూర్యకుమార్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (6) తను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికి అతను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్ తలో వికెట్ తీసుకున్నారు.