Sachin Tendulkar | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, మహిళా జట్టు మాజీ కోచ్ వెంకట రామన్ బీసీసీఐకి కీలక సూచనలు చేశారు. టెస్ట్ సిరీస్‌కు బ్యాటింగ్ సలహాదారుగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఆస్ట్రేలియాకు పంపాలని సూచించారు. టెండూల్కర్ నైపుణ్యం భారత జట్టుకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జట్టులో కన్సల్టెంట్లను చేర్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నెల 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనున్నది. ఈ సిరీస్‌కు ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా సైతం పెర్త్ టెస్టు కోసం 13 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో 0-3 తేడాతో ఓడిపోయిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసులో వెనుకపడిపోయింది. ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌ను భారత్ 4-0తో కైవసం చేసుకోవాల్సిందే. ఒకవేళ టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ అయినా ఓడినా, సిరీస్ ఫలితం భిన్నంగా వచ్చినా మిగతా జట్లపై ఆధారపడాల్సి రానున్నది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టెస్టుల్లో రాణించకపోవడం జట్టును కలవరపెడుతున్నది. టెస్టుల్లో కోహ్లీ ఫామ్‌ని పరిశీలిస్తే.. ఈ ఏడాది ఆడిన ఐదుటెస్టుల్లో పది ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేశాడు. ఇందులో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 11 టెస్టులు ఆడిన రోహిత్ 29.40 సగటుతో 588 పరుగులు చేశాడు. కోహ్లీ ఆరు టెస్టుల్లో 22.72 సగటుతో 250 పరుగులు మాత్రమే చేశాడు.
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
I think that #TeamIndia could benefit if they have the services of #Tendulkar as the batting consultant in their prep for the #BGT2025. Enough time between now and the 2nd test. Roping in consultants is rather common these days. Worth a thought? #bcci #Cricket
— WV Raman (@wvraman) November 13, 2024