భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (19) పెవిలియన్ చేరాడు. మిచెల్ స్టార్క్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి బౌండరీ బాదిన కోహ్లీ.. ఆ తర్వాత వచ్చిన షార్ట్ బాల్‌ను ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు.
ఆఫ్ స్టంప్ లైన్లో వేసిన షార్ట్ బాల్‌ను లెగ్ సైడ్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫైన్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మార్ష్ చక్కని క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన హార్దింక్ పాండ్యా (2) విఫలమయ్యాడు.
రిచర్డ్సన్ వేసిన స్లో షార్ట్ బాల్‌ను అంచనా వేయలేకపోయిన అతను.. ర్యాంప్ షాట్ ఆడటంలో కొంచెం తొందరపడ్డాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి నేరుగా షార్ట్ థర్డ్‌లో ఉన్న టిమ్ డేవిడ్ వైపు వెళ్లింది. అతను ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో భారత జట్టు 14 ఓవర్లకు 128/4 స్కోరుతో నిలిచింది.