IND Vs AUS | బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా శనివారం నుంచి బ్రిస్బెన్ వేదికగా మూడో టెస్ట్ జరుగనున్నది. ఐదు టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా-ఆస్ట్రేలియా చెరో మ్యాచ్‌లో విజయం సాధించారు. పెర్త్ టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక అడిలైడ్‌లో జరిగిన డే-నైట్ టెస్ట్‌లో ఆసిస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా మూడు టెస్టులు జరిగాల్సి ఉన్నది. గబ్బా వేదికగా మూడో టెస్ట్ మొదలవనున్నది. ఈ సందర్భంగా టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో టెస్ట్ నుంచే టీమిండియా మూడు టెస్టుల సిరీస్‌గా కొత్తగా ప్రారంభిస్తామని చెప్పాడు. అడిలైడ్‌లో ఓటమితో భారత్ నిరాశకు గురైందని గిల్ పేర్కొన్నారు. జట్టులో వాతావరణం సానుకూలంగా ఉందని, బ్రిస్బేన్‌లో జరిగిన పార్టీలో జట్టు పాల్గొందని.. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుతుందని తెలిపాడు.
గురువారం జరిగిన డిన్నర్లో జట్టు సరదాగా గడిపిందని చెప్పాడు. అడిలైడ్ టెస్ట్ అంచనాల ప్రకారం జరుగలేదని.. కానీ, ఇకపై జరుగబోయే సిరీస్‌ని మూడు టెస్టుల సిరీస్‌గానే పరిగణించనున్నట్లు పేర్కొన్నాడు. బ్రిస్బేన్‌లో విజయం సాధిస్తే.. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో పైచేసి సాధించవచ్చని పేర్కొన్నారు. గత సిరీస్‌లోనూ అడిలైడ్‌లో మాకు ఓ పరాజయం ఎదురైందని.. కానీ, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడూ కూడా అదే సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతామని చెప్పారు. 2021 సిరీస్ సమయంలో అడిలైడ్ టెస్ట్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత.. మళ్లీ కోలుకొని భారత్ సిరీస్‌ను కైవసం చేసుకున్నది. గత టెస్ట్ సిరీస్‌లో పంత్ 89, గిల్ 91 పరుగులు చేయడంతో భారత్ 328 పరుగుల లక్ష్యాన్ని అందుకున్నది. 33 సంవత్సరాల తర్వాత గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడించింది. గబ్బా పిచ్ బాగుందని.. జట్టు స్టేడియానికి చేరిన తర్వాత అందరూ ఒక రౌండ్ వేసి పరీక్షించినట్లు తెలిపాడు. ఆడే సమయంలోనే పిచ్ గురించి మరింత తెలుస్తుందని చెప్పుకొచ్చారు.