IND vs AUS : ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఫిఫ్టీ బాదాడు. 94 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మర్ఫీ ఓవర్లో సింగిల్ తీసి 50కి చేరువయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో అక్షర్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. ఎనిమిదో వికెట్‌కు రవీంద్ర జడేజాతో కలిసి 74 రన్స్ జోడించాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్ 300 దాటించారు. అక్షర్, జడ్డూ ఇద్దరూ.. మర్ఫీ, లియాన్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచారు. జడేజా 60 రన్స్‌తో ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ 137 పరుగుల ఆధిక్యంలో ఉంది.