IND Vs AUS | ఆస్ట్రేలియాతో ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా టీమిండియా రెండో టెస్ట్‌లో తలపడబోతున్నది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే.. టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. పెర్త్ టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డే నైట్ టెస్ట్‌కు ముందు సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ మాట్లాడాడు. టీమిండియాలో అందరూ స్టార్ ఆటగాళ్లే ఉన్నారన్నారని చెప్పాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీపై మాత్రమే కాకుండా భారత ఆటగాళ్లందరినీ ఎదుర్కొనేందుకు జట్టు సిద్ధమవుతుందని తెలిపాడు. భారత జట్టును చూస్తుంటే సూపర్ స్టార్ల సమూహంగా కనిపిస్తుందని.. క్రికెట్ జట్టుగా ఆడాల్సిన క్రీడ అని.. ఇందులో గెలవాలంటే అందరూ రాణించాల్సిందేనని చెప్పాడు. భారత్‌లో బుమ్రాతో పాటు మరికొందరు అసాధారణ ఆటగాళ్లు ఉన్నారన్నాడు. భారత జట్టును ప్రశంసిస్తూ.. భారత్‌లోని మిగతా ఆటగాళ్లు సైతం అద్భుతమైన ప్రతిభావంతులని.. జట్టు గొప్పగా ఉందని పేర్కొన్నాడు.
తాము ఏ ఒక్క ఆటగాడిపై దృష్టి పెట్టబోడవడం లేదన్నాడు. మైదానంలోకి దిగబోయే ప్రతి భారతీయ ఆటగాడిపై గౌరవం ఉంటుందని.. దాని అర్థం తాము పోటీ ఇవ్వమని అర్థం కాదని.. కానీ, మా పద్ధతిలో క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామని.. గొప్ప జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పాడు. తొలి టెస్ట్‌లో ఆఫ్ స్పిన్నర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు తాత్కాలిక కెప్టెన్ బుమ్రా అవకాశం ఇచ్చాడు. ఈ నిర్ణయంపై తనకు షాక్ ఇచ్చిందని ఆస్ట్రేలియా స్పిన్నర్ చెప్పాడు. ఎవరు మైదానంలోకి వచ్చిన అది మంచి సవాల్‌గానే ఉంటుందని పేర్కొన్నారు. నితీశ్ కుమార్‌రెడ్డి గురించి మాట్లాడుతూ.. లియాన్ బౌలింగ్‌ను నితీశ్ రెడ్డి ఎదుర్కొన్నాడు. అయితే, అతని బ్యాటింగ్ చూసి ఆశ్చర్య పోలేదని.. అతను ఫోర్లు బాదేందుకు ప్రయత్నిస్తున్నాడని.. దాంతో తనకు వికెట్లు తీసేందుకు అవకాశం ఉందని చెప్పాడు. భవిష్యత్‌లోనే ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.