పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ పిచ్ ఆరంభంలో స్వింగ్, సీమ్‌కు అనుకూలిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. పెర్త్‌లో ఆడిన ప్రాక్టీస్ మ్యాచుల్లో తాము ఎంత సిద్ధమయ్యామో అర్థమైందని, ఈ రెండు వార్మప్ మ్యాచులతో టోర్నీకి పూర్తిగా సిద్ధమవుతామని రోహిత్ చెప్పాడు.