భారీ లక్ష్యఛేదనలో అఫ్ఘానిస్తాన్ బ్యాటర్లు తడబడుతున్నారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు జజాయ్ (0), గుర్బాజ్ (0) పెవిలియన్ చేరగా.. మూడో ఓవర్లో మరోసారి భువీ ఆ జట్టును దెబ్బకొట్టాడు. భువీ వేసిన అవుట్ స్వింగర్‌ను ఆడేందుకు ప్రయత్నించిన కరీమ్ జనత్ స్లిప్స్‌లో ఉన్న కోహ్లీకి సులభమైన క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ తర్వాత కాసేపటికే నజీబుల్లా జద్రాన్ (0) కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.