ముంబై: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. శుక్రవారం డీవై పాటిల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరుగనుంది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా గేమ్స్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన హర్మన్‌ప్రీత్ బృందం.. ఆసీస్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. స్మృతి మందన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ సమష్టిగా సత్తాచాటితే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయమే.