తాష్కెంట్: బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అనూహ్య ఫలితం ఎదురైంది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న స్టార్ బాక్సర్ శివ తాపా ఆదిలోనే నిష్క్రమించాడు. గురువారం జరిగిన 63కిలోల బౌట్లో శివ 3-4 తేడాతో డాస్ రెయిస్ యురీ(బ్రెజిల్) చేతిలో పోరాడి ఓడాడు. శివకు తొలి రౌండ్లో బై లభించగా, మలి రౌండ్లో నిరాశే ఎదురైంది.
తొలి రౌండ్‌ను ఒకింత నెమ్మదిగా మొదలుపెట్టిన శివ..ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు. పుంజుకుని పోటీలోకి వచ్చి రెండో రౌండ్లో ఆధిక్యం కనబరిచినా..ఆఖరి రెండు నిమిషాల్లో పట్టు వదలడంతో ఓటమి ఎదురైంది. మరోవైపు నరేందర్ బర్వాల్(92+కి), గోవింద్ సహానీ(48కి) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.