మాడ్రిడ్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి, సుమిత్‌రెడ్డి జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో సిక్కి, సుమిత్ ద్వయం 17-21, 12-21తో రినోవ్ రివాల్డీ, పితా హనిన్గ్తాస్(ఇండోనేషియా) జోడీ చేతిలో ఓటమిపాలైంది. 28 నిమిషాల్లోపే ముగిసిన పోరులో ఇండోనేషియా షట్లర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. సెమీస్ వరకు టోర్నీలో మెరుగ్గా ఆడిన సిక్కి, సుమిత్ అదే జోరు కొనసాగించలేకపోయారు.