చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌ను విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా ఆరంభించింది. వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన బెంగళూరు హ్యాట్రిక్‌పై కన్నేసింది. 2012 తర్వాత తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందడం బెంగళూరుకు ఇదే తొలిసారి కావడం విశేషం. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన కోల్‌కతా నైట్‌రైడర్స్ బలంగా పుంజుకోవాలని భావిస్తోంది.
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలో దిగుతున్నట్లు కోహ్లీ చెప్పాడు. డేన్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పటిదార్ తుది జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని ఆ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్ వెల్లడించాడు.
Welcome to the first double-header Sunday at the #VIVOIPL
— IndianPremierLeague (@IPL) April 18, 2021
In Match 10 – #RCB will take on #KKR at The Chepauk.
Who are you rooting for?#RCBvKKR pic.twitter.com/ZmZCvAoCqc
Match 10. Royal Challengers Bangalore XI: V Kohli, D Padikkal, R Patidar, G Maxwell, AB de Villiers, W Sundar, S Ahmed, K Jamieson, H Patel, M Siraj, Y Chahal https://t.co/Wv7vW3gYrf #RCBvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 18, 2021
Match 10. Kolkata Knight Riders XI: S Gill, N Rana, R Tripathi, E Morgan, D Karthik, S Al Hasan, A Russell, P Cummins, H Singh, V Chakaravarthy, P Krishna https://t.co/Wv7vW3gYrf #RCBvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 18, 2021