కాన్కన్(మెక్సికొ) : డబ్ల్యుటీఏ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో ఇగా స్వియాటెక్ టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో స్వియాటెక్ 6-1, 6-0తో జెస్సికా పెగులాపై గెలుపొందడమేగాక, రెండు నెలల తరువాత తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. 22 ఏళ్ల స్వియాటెక్ మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించి తనకెదురు లేదని నిరూపించుకుంది. టోర్నీలో ఆడిన అయిదు మ్యాచ్‌లలో గెలుపొందిన స్వియాటెక్ ఒక్క సెట్నుకూడా ప్రత్యర్థులకు కోల్పోలేదు. 2022 ఏప్రిల్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన స్వియాటెక్ గత సెప్టెంబర్‌లో దానిని కోల్పోయింది. ఈ టైటిల్‌తో తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.