ICC : ఓవల్ మైదానం(Oval Stadium)లో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. ఐసీసీ ఫైనల్స్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. అయితే.. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(Cameron Green) పట్టిన శుభ్‌మన్ గిల్(Shubman Gill) క్యాచ్‌పై దుమారం రేగిన విషయం తెలిసిందే. గ్రీన్ డైవ్ చేస్తూ బంతిని అందుకున్నఫొటోలను తాజాగా ఐసీసీ సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
That Cameron Green catch!#WTC23 | #AUSvIND pic.twitter.com/bL4IwCC8d6
— ICC (@ICC) June 11, 2023
ఆ ఫొటో చూసిన భారత అభిమానులు ఐసీసీ, గ్రీన్‌ను తిట్టిపోస్తున్నారు. ‘బంతి నేలకు తాకినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది’, ‘ఐసీసీ అంటే.. ఇంటర్నేషనల్ క్యాచ్ కరప్షన్’, ‘అది కచ్చితంగా నాటౌట్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. శుభ్‌మన్ కూడా ఈ ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
🔎🔎🤦🏻♂️ pic.twitter.com/pOnHYfgb6L
— Shubman Gill (@ShubmanGill) June 10, 2023
భారీ లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌ను భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(43), శుభ్‌మన్ గిల్(18) ధాటిగా ఆరంభించారు. అయితే.. 41 పరుగుల వద్ద బోలాండ్ ఓవర్లో గిల్ బంతిని స్లిప్‌లో ఆడాడు. అక్కడే ఉన్న గ్రీన్ ఎడమైవైపు డైవ్ చూసి, ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో, అంపైర్ ఔట్ ఇచ్చాడు. రిప్లేలో చూస్తే బంతి నేలకు తాకినట్టు కనిపిస్తోంది. కానీ, సాఫ్ట్ సిగ్నల్ రూల్ లేకపోయంతో అంపైర్ గిల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దాంతో, గిల్‌తో సహా, భారత అభిమానులు ఆశ్చర్యపోయారు.
రెండో ఇన్నింగ్స్‌లో ఈ యంగ్ ఓపెనర్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. భారీ స్కోర్ కొడతాడనిపించింది. కానీ, గ్రీన్ చీటింగ్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అందుకని కోపంతో ఊగిపోయిన ఫ్యాన్స్ టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో గ్రీన్‌ను ‘చీటర్.. చీటర్’ అని ఎద్దేవా చేశారు. ఆసీస్ ఆల్‌రౌండర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘గిల్ ఆడడాన్ని భారత అభిమానులు నిజంగా చాలా ఇష్టపడతారు. కానీ, అతను ఔట్ అయ్యాడు. జరిగిందేదో జరిగింది. మేము ఆ విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నాం’ అని తెలిపాడు.
తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆ జట్టు సంచలన ఆటతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. 209 పరుగలు తేడాతో గెలిచి టెస్టు గదను సాధించింది. దాంతో, రెండోసారైనా చాంపియన్‌గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది. రెండో ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే(46), విరాట్ కోహ్లీ(49), శ్రీకర్ భరత్(23) ప్రతిఘటించినా స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు పడడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. నాథన్ లియాన్ ఓవర్లో సిరాజ్ స్వీప్ షాట్ ఆడి బోలాండ్ చేతికి చిక్కాడు. దాంతో, ఆసీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.