ICC | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2024 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ వుమెన్స్ క్రికెటర్స్ నామినేషన్ జాబితాను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో ఒక్క ఇండియన్ వుమెన్ క్రికెటర్ సైతం చోటు దక్కించుకోలేకపోయింది. ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు, న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కెర్, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ పేర్లు ఉన్నాయి. టీమిండియా తరఫున స్మృతి మంధాన ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయినా కూడా బెస్ట్ ప్లేయర్‌గా అవార్డుకు నామినేట్ కాలేకపోయింది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు చాలాకాలంగా చాలాకాలంగా బ్యాట్‌తో అద్భుతాలు చేస్తుందని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ వుమెన్స్ ర్యాకింగ్స్లో వన్డేలతో పాటు టీ20ల్లోనూ బ్యాట్స్‌వుమెన్, ఆల్ రౌండర్స్‌లో టాప్-10 ప్లేయర్లలో చమరి కొనసాగుతున్నది. బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటుతుంది. ఆమె ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 1000 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 30 వికెట్లు పడగొట్టింది.
ఈ ఏడాది మహిళా క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారిణిగా చమరి తన స్థానాన్ని నిలుపుకున్నది. చమరి తొమ్మిది వన్డేల్లో 65.42 సగటుతో 458 పరుగులు చేసి, తొమ్మిది వికెట్లు పడగొట్టింది. 21 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 720 పరుగులు చేసి.. 21 వికెట్లు తీసింది. అమేలియా కెర్ తన అద్భుతమైన ఆటతీరుతో ఇక న్యూజిలాండ్ వుమెన్స్ టీమ్‌ను టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలుపవడంతో కీలకపాత్ర పోషించింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ లారా వోల్వార్డ్ వన్డేలతో పాటు టీ20 ప్రపంచకప్‌లో అత్యధికంగా పనులు చేసి బెస్ట్ క్రికెటర్ అవార్డు రేసులో నిలిచింది. వోల్వార్డ్ 12 వన్డేల్లో 87.12 సగటుతో 697 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 184 నాటౌట్. మూడు టెస్టుల్లో 223 పరుగులు చేసింది. 9 టీ20 మ్యాచ్‌లలో 39.58 సగటుతో 673 పరుగులు చేయగా.. బెస్ట్ స్కోర్ 102. అలాగే, ఆస్ట్రేలియా క్రికెటర్ అన్నాబెల్ సదర్లాండ్ సైతం అవార్డు రేసులో నిలిచింది. ఈ ఏడాది 12 వన్డేల్లో 369 పరుగులు, 13 వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.