ICC | మైదానంలో గొడవ.. యశస్వి, ఫెర్నాండోకు భారీ జరిమానా..!
ICC : భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), అసితా ఫెర్నాండో(Asitha Fernando)లు భారీ మూల్యం చెల్లించారు. కొలంబో టెస్టులో తొలి రోజు మైదానంలో గొడవ పడినందుకు ఇద్దరికి భారీ జరిమానా పడింది.
ICC : భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), అసితా ఫెర్నాండో(Asitha Fernando)లు భారీ మూల్యం చెల్లించారు. కొలంబో టెస్టులో తొలి రోజు మైదానంలో గొడవ పడినందుకు ఇద్దరికి భారీ జరిమానా పడింది. ఐసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందున యశస్వీ, ఫెర్నాండో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది ఐసీసీ.
ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు భారత క్రికెటర్ యశస్వీ జైస్వాల్, శ్రీలంక పేసర్ అసితా ఫెర్నాండోకు భారీ జరిమానా పడింది. కొలంబో టెస్టులో రోజైన ఆదివారం.. మైదానంలో గొడవకు దిగిన ఇద్దరూ రిఫరీ ముందు తమ పొరపాటును అంగీకరించారు. దాంతో.. మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడకుండా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది ఐసీసీ. లెవల్ 1 నిబంధనను అతిక్రమించినందుకు ఊహించినట్టుగానే వీరికి ఫైన్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది ఐసీసీ.
Yashasvi Jaiswal and Asitha Fernando have both been fined 25% of their match fees for “inappropriate physical contact” during the first day’s play in the second Test between Sri Lanka and India in Colombo on Sunday.
Both players have also had a demerit point added to their… pic.twitter.com/IVLxsvdwCu
— Cricinfo (@cricinfo) August 24, 2026
జరిగింది ఇది..
కొలంబో టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమైనా.. యశస్వీ జైస్వాల్ క్రీజునంటుకున్నాడు. అర్ధ శతకానికి చేరువైన అతడిని అసితా ఫెర్నాండో ఔట్ చేశాడు. 45 పరుగుల వద్ద యశస్వీ వికెట్ తీసిన లంక పేసర్.. మాటల యుద్ధానికి తెరతీశాడు. దాంతో, యశస్వీకి కోపమొచ్చింది.

పెవిలియన్ వెళ్లాల్సిన అతడు.. ‘ఏం అన్నావు’ అంటూ గుర్రుగా ఫెర్నాండో వైపు నడిచాడు. ఫెర్నాండో సైతం తగ్గకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవ పెద్దదయ్యేలా కనిపించింది. అయితే.. పరిస్థితిని గమనించిన లంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా ఇద్దరిని నిలువరించి దూరం పంపించేశాడు. పడిక్కల్(117) సెంచరీతో తొలి రోజును టీమిండియా 300/5తో ముగించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

