దుబాయ్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు చెందిన ప్రైజ్‌మనీ(WTC Prize Money)ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇవాళ ప్రకటించింది. గత టోర్నీలతో పోలిస్తే .. నజరానాను రెండింతలు పెంచేశారు. వచ్చే నెల జూన్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఫైనల్ నెగ్గిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనున్నది. గత ఎడిషన్‌తో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువే. 2023లో ఇండియాపై ఫైనల్లో నెగ్గిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది.
2025 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్.. లార్డ్స్ మైదానంలో జరగనున్నది. ఇక ఫైనల్లో ఓడిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల ప్రైజ్‌మనీ అందుతుంది. గత ఏడాది టోర్నీలో రన్నరప్‌కు 8 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ కల్పించారు. టెస్టు క్రికెట్ ప్రాముఖ్యతను పెంచే ఉద్దేశంతో ప్రైజ్‌మనీ పెంచినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Record figures 💰
The #WTC25 prize pool has been revealed ahead of the Ultimate Test 👇https://t.co/09tsNlB18Z
— ICC (@ICC) May 15, 2025
డబ్ల్యూటీసీ సైకిల్లో ఈసారి దక్షిణాఫ్రికా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగిన హోం సిరీస్‌లో ఆ జట్టు నెగ్గింది. 69.44 శాతం పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో నిలుచున్నది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నది. 50.00 పాయింట్లతో ఇండియా మూడవ స్థానంలో నిలుచున్నది.
ఐసీసీ చైర్మెన్ జే షా మాట్లాడుతూ.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు చెందిన మూడవ సైకిల్ ఆసక్తికరంగా సాగినట్లు చెప్పారు. కాంపిటీషన్ చివరలో మాత్రమే ఫైనలిస్టుల వివరాలు తెలిసినట్లు తెలిపారు. వేర్వేరు దేశాలకు చెందిన ఆటగాళ్ల అసాధారణ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నట్లు తెలిపారు. లార్డ్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నట్లు జే షా చెప్పారు.